కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరిధిలోని సావర్ ఖేడ గ్రామంలో ఇళ్లలో దాచి ఉంచిన 53 కిలోల నిషేధిత గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆదే తిరుపతి, వడాయి బిక్కు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వాంకిడి సీఐ సుధాకర్ తెలిపారు.
అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి పట్టివేత - Komuram Bhim Asifabad district police seized cannabis smuggled
నిషేధిత గంజాయిని అక్రమంగా ఇళ్లలో నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 53 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరిధిలో జరిగింది.
అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
కెరమెరి మండలం పరిధిలోని సావర్ ఖేడ గ్రామంలోని ఇళ్లలో కొందరు గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచారన్న ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న వాంకిడి సీఐ సుధాకర్, కెరమెరి మండల ఎస్సై రమేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని ఆదే తిరుపతి, వడాయి బిక్కుల ఇళ్లలో 53 కిలోల నిషేధిత గంజాయి లభ్యమైంది. గంజాయిని సీజ్ చేసిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు.