తెలంగాణ

telangana

ETV Bharat / crime

సూర్యాపేట భాజపా అధ్యక్షుడు అరెస్ట్.. గుర్రంబోడు ఘర్షణే కారణం - Suryapeta district BJP president arrested

భాజపా గిరిజన రైతు భరోసా యాత్రలో పోలీసులపై దాడులకు పరోక్షంగా కారణమైన... సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డిని కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు హుజూర్​నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Kodada police have arrested Suryapeta district BJP president Bobba Bhagyareddy
సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు.. గుర్రం బొడు తండా ఘర్షణే కారణం

By

Published : Feb 8, 2021, 1:23 PM IST

గుర్రంబోడు తండాలోని భాజపా గిరిజన రైతు భరోసా యాత్రలో పోలీసులపై దాడులకు పరోక్షంగా... కారణమైన సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డిని కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ బై పాస్​ వద్ద భాగ్యరెడ్డి టీ తాగితున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరితో పాటు హుజూర్​నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడకు చెందిన భాజపా రాష్ట్ర నాయకుడు ఓర్సు వేలంగిరాజును సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 101 కరోనా కేసులు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details