నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో కత్తి పోట్లు కలకలం రేపాయి. నందిపేట మండలం నిఖాల్పూర్ గ్రామానికి చెందిన నర్సింహస్వామిపై స్టాలిన్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఇజ్రాయెల్ పంపిస్తానని గల్ఫ్ ఏజెంట్ స్వామి... స్టాలిన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. పలు కారణాలతో పంపించలేక పోయిన స్వామి... డబ్బులు తిరిగి ఇచ్చేశాడు.
గల్ఫ్‌కు పంపించలేదనే కోపంతో ఏజెంట్‌పై కత్తితో దాడి - mamidipally knife attack
గల్ఫ్ దేశాలకు పంపిస్తానని చెప్పి... పంపించలేదనే కోపంతో ఏజెంట్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఏజెంట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
![గల్ఫ్‌కు పంపించలేదనే కోపంతో ఏజెంట్‌పై కత్తితో దాడి knife attack on gulf ajent in mamidipally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10783753-414-10783753-1614324656922.jpg)
knife attack on gulf ajent in mamidipally
గల్ఫ్‌కు పంపించలేదనే కోపంతో ఏజెంట్‌పై కత్తితో దాడి
ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న స్టాలిన్.. కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్వామికి స్వల్ప గాయాలు కాగా.. ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.