Knife Attack on Brothers: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో పండుగ వేళ చిన్నపాటి గొడవ.. కత్తిపోట్లకు దారి తీసింది. పాతకక్షల నేపథ్యంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే...స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌కు చెందిన తోకల తిరుపతి, కృష్ణ, బాలయ్య సోదరులు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న మరో నలుగురు అన్నదమ్ములతో ఆ కుటుంబానికి పాతకక్షలున్నాయి. శనివారం చిన్నపిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఇంట్లో రాళ్లుపడడంతో మాటామాట పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. ముగ్గురికి తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.