జగిత్యాల మెహబూబాపురాలో ఆమెర్ అనే యువకున్ని గురువారం అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు అపహరించుకుపోయారు. కారులో యువకుడి ఇంటికి చేరుకున్న నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కత్తులతో బెదిరించి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు.
బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కిడ్నాప్‌ను ఛేదించేందుకు అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు.