తెలంగాణ

telangana

ETV Bharat / crime

CRIME NEWS: 'నువ్వొక్కదానివి నాకు సరిపోవు.. రోజుకొకర్ని తీసుకురా' - khiladi couple

తొమ్మిదేళ్ల కిందట ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దని తన వెంటే ఉండాలని బెదిరించాడు. అలా అతడితోనే ఉన్న ఆమె.. నెమ్మదిగా అతడి ఆకర్షణకు లోనైంది. వివాహమై ఇద్దరు పిల్లలున్నా.. వాళ్లను వదిలేసి కొన్నాళ్లు అతడితో సహజీవనం చేసింది. కొద్దిరోజులకు ఆమెపై మోజు తీరిన అతడు.. "రోజుకో అమ్మాయి కావాలి.. తీసుకొస్తే తీసుకురా లేదంటే నిన్ను వదిలేస్తా" అని బెదిరించడంతో.. దిక్కులేనిదాన్ని అయిపోతానని భావించిన సదరు మహిళ.. అతడు చేసే అఘాయిత్యాలకు సహకరిస్తూ వచ్చింది. చివరకు అతడితో కలిసి కటకటాలపాలైంది.

నువ్వొక్కదానివి నాకు సరిపోవు.. రోజుకొకర్ని తీసుకురా
నువ్వొక్కదానివి నాకు సరిపోవు.. రోజుకొకర్ని తీసుకురా

By

Published : Jul 31, 2021, 9:49 AM IST

Updated : Jul 31, 2021, 3:37 PM IST

ఒకప్పుడు తానూ బాధితురాలే. కానీ అతడి బెదిరింపులకు భయపడింది. నెమ్మదిగా అతని పంచనే చేరింది. భర్త, పిల్లలను వదిలేసి అతడితోనే సహజీవనం చేసింది. అతడు చేసే అఘాయిత్యాలకు సహకరించింది. చివరకు నిందితుడితోపాటు జైలు ఊచలు లెక్కపెడుతోంది.

‘నువ్వొక్కదానివి నాకు సరిపోవు. రోజుకో అమ్మాయి కావాలి. తీసుకొస్తే తీసుకురా. లేదంటే నిన్ను వదిలేస్తా అంటూ నన్ను బెదిరించేవాడు. అందుకే అతను చేసే అఘాయిత్యాలకు నేను సహకరించేదాన్ని. ఒప్పుకుంటే లైంగిక దాడి చేసేవాడు. ప్రతిఘటిస్తే నరకం చూపించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరనుకుంటే వదిలేసేవాడు. ఒకవేళ చేస్తారని అనిపిస్తే అత్యంత కిరాతకంగా చంపేసేవాడు’ అంటూ ఆమె చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.

దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన కిలాడీ జంట నేర చరిత్ర గురించి తవ్వేకొద్దీ పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈనెల 25న దుండిగల్‌ ఠాణాలో పరిధిలో మహిళ(37) దారుణ హత్య కేసులో ఐడీఏ బొల్లారం వైఎస్సార్‌ కాలనీలో ఉంటున్న కురువ స్వామి అలియాస్‌ రవి(32), మసనమొల్ల నర్సమ్మ(30)ను అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు మహిళను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

ఆమె కూడా బాధితురాలే..

స్వామి ఏ పని చేయడు. విలాసవంతమైన జీవితం కావాలి. లేబర్‌ అడ్డాలు, మార్కెట్ల దగ్గర అందంగా.. ఒంటిపై ఆభరణాలు కనిపించే మహిళలను ట్రాప్‌లోకి దింపేవాడు. సమీపంలోని అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి ఆభరణాలతో ఉడాయించేవాడు. ఈ తరహాలోనే తొమ్మిదేళ్ల కిందట నర్సమ్మపైనా అఘాయిత్యం చేశాడు. అలా స్వామి పరిచయమయ్యాడు. అంతకుముందే ఆమెకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త, పిల్లల్ని వదిలేసి స్వామితో కొన్నాళ్లు సహజీవనం చేసింది. తర్వాత అతణ్ని పెళ్లి చేసుకుంది. కొట్టేసిన ఆభరణాలను కుదువపెట్టి.. ఆ డబ్బుతో 15.. 20 రోజులు జల్సా చేసేవారు. తర్వాత మళ్లీ మరో మహిళపై దారుణానికి ఒడిగట్టేవారమని పోలీసులకు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా రెండు నెలలకోసారి మకాం మార్చేవారు. అందుకే ఇంట్లో పెద్దగా సామాను పెట్టుకునేవారు కాదు. వీరి చేతికి చిక్కిన చాలామంది బాధితులు పరువు పోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదు. అదే.. వీరు మరిన్ని దారుణాలకు పాల్పడేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు :

  • WOMAN MURDER: కిల్లర్ దంపతులు.. అడ్డా మీద మహిళా కూలీలపైనే గురి!
Last Updated : Jul 31, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details