తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

Student died due to gun misfire: ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం విద్యార్థి అక్కడ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మృతిచెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటనలో బుల్లెట్ విద్యార్థి తలలోకి దూసుకెళ్లింది. విద్యార్థి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో సొంత గ్రామం మధిరలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Student died due to gun misfire
Student died due to gun misfire

By

Published : Feb 7, 2023, 3:28 PM IST

Updated : Feb 7, 2023, 7:44 PM IST

Student died due to gun misfire: అమెరికాలో తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మరోవైపు అక్కడికి సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు.

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయింది. అఖిల్‌ సాయి తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్‌ మృతిచెందాడు. అఖిల్‌ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

అఖిల్‌సాయి ఫ్యామిలీ ఫొటో

అఖిల్ సాయి మరణవార్తతో సొంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బుల్లెట్ గాయంతో తమ కుమారుడు కోలుకొని వస్తాడు అనుకున్నామని.. కానీ ఇంతలోనే అమెరికా నుంచి చనిపోయాడని వార్త వినాల్సి వచ్చిందని తల్లిదండ్రులు రోదించారు. తమ కొడుకు మృతదేహాన్ని కడసారైనా చూసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ అఖిల్ సాయి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 7, 2023, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details