తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆత్మహత్యకు దారితీసిన క్రిప్టో కరెన్సీ లావాదేవీలు... అసలేం జరిగిందంటే..? - తెలంగాణ క్రైమ్​ వార్తలు

khammam person suicide at suryapet: క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ లావాదేవీలు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణానికి దారితీసింది. తనతో పాటు పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన గుండెమెడ రామలింగస్వామి సూర్యాపేటలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి(suryapet suicide case) పాల్పడ్డాడు. మృతి చెందిన విషయాన్ని గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

suicide in suryapet
suicide

By

Published : Nov 25, 2021, 2:19 PM IST

క్రిప్టో కరెన్సీ ఆన్​ లైన్​ లావాదేవీల్లో విభేదాల కారణంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సూర్యాపేటలో ఆత్మహత్య(khammam person suicide at suryapet) చేసుకున్నాడు. ఖమ్మం కవిరాజనగర్‌కు చెందిన గుండెమెడ రామలింగస్వామి(36) క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. అతనితో పాటు ఏపీలోని కృష్ణ జిల్లాకు చెందిన మరో ఇద్దరు మిత్రులతో పెట్టుబడి పెట్టించాడు. అయితే క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం నిషేధం విధించనుందన్న వార్తల నేపథ్యంలో వారు తమ డబ్బు తమకు కావాలని రామలింగస్వామిపై ఒత్తిడి తెచ్చారు. అతన్ని చర్చలకని పిలిచి నిర్బంధించారు. అతని కారును, బంగారు ఆభరణాలను తీసుకున్నారు. ఇంకా డబ్బు కావాలని బెదిరించటంతో.. మనస్తాపానికి గురైన రామలింగస్వామి సోమవారం రోజు సూర్యాపేటకు వెళ్లి... ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి(Today suryapet crime news) పాల్పడ్డాడు. మృతి చెందిన విషయాన్ని గుర్తించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

బుధవారం రోజు అతని అంత్యక్రియలు(Today crime news) నిర్వహించారు. బిట్‌ కాయిన్‌ లావాదేవీల్లో రామలింగస్వామి పెట్టుబడి పెట్టి... ఖమ్మం నగరానికి చెందిన మరికొంత మందిని చేర్పించారని బంధువులు తెలిపారు. అయితే కృష్ణా జిల్లాకు చెందిన వారు కావాలనే ఒత్తిడి తెచ్చి రామలింగస్వామి మరణానికి కారణమయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Father rapes Daughter in Vikarabad : కుమార్తెను గర్భవతి చేసిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details