తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో కీలక నిందితుడి అరెస్టు, రూ.9 కోట్లు స్వాధీనం - క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసు

Key suspect arrested in crypto currency trading fraud case
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కేసులో కీలక నిందితుడు అరెస్టు, రూ.9కోట్లు స్వాధీనం

By

Published : Aug 24, 2022, 3:55 PM IST

Updated : Aug 24, 2022, 4:49 PM IST

15:52 August 24

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో కీలక నిందితుడు అరెస్టు

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో కీలక నిందితుడు అరెస్టు

ఫోర్జరీ, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మోసం కేసులో యూపీకి చెందిన కీలక నిందితుడిని రాష్ట్ర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని చందౌలీ జిల్లాలో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుడు అభిషేక్ జైన్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై మూడు కమిషనరేట్ పరిధుల్లో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడి వద్ద నుంచి రూ.9 కోట్లకు పైగా నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

చందౌలీ జిల్లాలోని రవినగర్‌లో ఉన్న ఓ బడా వ్యాపారవేత్త కుమారుడు అభిషేక్ జైన్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో ఉన్న​ రూ.9 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ జైన్ యాప్ ద్వారా ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు తన యాప్ ద్వారా రాష్ట్రానికి చెందిన చాలా మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే నిందితుడిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:డా.పత్తిపాక మోహన్‌ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపిక

Last Updated : Aug 24, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details