Online gaming and investment scam case : ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల మోసాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకే గదిలో 5 కంపెనీలు ఉన్నట్లు నిందితులు రికార్డుల పరిశీలనలో తేలింది. 13 షెల్ కంపెనీల ద్వారా నిందితులు వేల కోట్లు కొల్లగొట్టారు.
ఒక్క అడ్రస్‌పై 5 కంపెనీలు.. లోన్ యాప్ కేసులో వెలుగుచూస్తున్న మోసాలు..
12:39 January 31
ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల మోసాల కేసులో కీలక విషయాలు
చైనీస్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసిన శ్రీనివాసరావు... స్నేహితులు, కుటుంబసభ్యులే డైరెక్టర్లుగా 13 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల ఏర్పాటు కోసం చైనీయులు రూ.5 లక్షలకు పైగా కమీషన్లు ఇచ్చినట్లు తెలిసింది. కంపెనీల ఏర్పాటు వెనుక చైనీయులు జాలి, మైకెల్, టేజర్ ఉండగా... వీరు ముగ్గురూ పరారీలో ఉన్నారు.
Online scam case: ఇప్పటికే శ్రీనివాసరావు, విజయభాస్కర్, విజయ్‌కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లో లోన్ రికవరీ కాల్‌సెంటర్‌ను టేజర్ నిర్వహించారు. రెండు కంపెనీల ఖాతాల లావాదేవీలను సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. వారంలోనే రెండున్నర కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మిగిలిన 11 కంపెనీల ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గేమింగ్ పెట్టుబడుల పేరిట కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:ఏటీఎం ఎత్తుకెళ్లి ధ్వంసం చేసిన దొంగలు