Thief arrested in Nellore: పద్నాలుగేళ్లుగా చోరీలే వృత్తిగా ఎంచుకొని.. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో వందకుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏపీ నెల్లూరు జిల్లా కావలి పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడికి సంబంధించిన వివరాలను కావలి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
విశాఖ నగరంలోని గాజువాకకు చెందిన బోలా నాగసాయి(30)ని కావలి గ్రామీణ సీఐ షేక్ ఖాజావలి అరెస్టు చేశారు. ముసునూరు వద్ద ఉన్నాడన్న పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 184 గామ్రుల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నగదు అతను విలాసాలకు వినియోగించాడు.
జైౖలుకెళ్లడం.. తిరిగొచ్చి మళ్లీ...
జులైలో జైలు నుంచి విడుదలైన తరువాత కావలిలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలో రెండు గృహాల్లో, ఒకటో పట్టణ పరిధిలో రెండు, నెల్లూరులో 8 ఇళ్లల్లో చోరీలు చేశాడని వివరించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప, కర్నూలుతో పాటు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా పలు చోరీలకు పాల్పడ్డాడు. ఇలా మొత్తం వందకుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని పట్టుకున్న కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, ఎస్సై వెంకట్రావు, సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్ అభినందించారు.
ఇదీ చదవండి:Allu Arjun fans attack on theatre owner: 'మేము లోకల్స్.. మాకు పుష్ప టికెట్లు ఇవ్వరా?'