తెలంగాణ

telangana

ETV Bharat / crime

ED On Karvy Case: కార్వీలో రూ.2,873 కోట్లను దారిమళ్లించారు: ఈడీ - Karvy chairman Parthasarathy by ed taken into the full custody

ED On Karvy Case: నిధుల మళ్లింపులో కార్వీ ఎండీ పార్థసారథితోపాటు సీఎఫ్‌వో కృష్ణహరి కీలకపాత్ర పోషించాలని ఈడీ తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 14 డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని పేర్కొంది.

ED arrests Karvy chairman and managing director in fraud case
ED arrests Karvy chairman and managing director in fraud case

By

Published : Jan 27, 2022, 8:57 AM IST

Updated : Jan 27, 2022, 4:11 PM IST

ED On Karvy Case: మనీలాండరింగ్ కేసులో కార్వీ ఎండీ పార్థసారథితో పాటు సీఎఫ్‌వో కృష్ణ హరిలను నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ విచారణకు తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడించింది. వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్ సీసీఎస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు తెలిపారు.

సంస్థ ఉద్యోగుల వాంగ్మూలం

2,873 కోట్ల రూపాయలు దారిమళ్లించారని.. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులో తనఖా పెట్టినట్లు గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. కార్వీపై పలు పోలీసు స్టేషన్లలోనూ కేసులున్నాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి గ్రూపులోని పలువురు ఉద్యోగుల వాంగ్మూలం నమోదుచేసినట్లు చెప్పారు.

డొల్లకంపెనీలకు ఆ నిధులు

గతేడాది సెప్టెంబర్ 22న కార్వీకి చెందిన పలు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. నిధుల మళ్లింపులో పార్థసారథి, కృష్ణ హరి కీలకపాత్ర పోషించారని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 14 డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తెలిపారు. ఈ కేసులో పార్థసారథికి చెందిన రూ.700 కోట్ల విలువ చేసే షేర్లను సీజ్‌ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.

నాలుగు రోజుల కస్టడీ..

మనీలాండరింగ్ కేసులో కార్వీ ఎండీ పార్థసారథిని ఈడీ విజ్ఞప్తి మేరకు నాంపల్లి కోర్టు 4 రోజుల జుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. పార్థసారథిని చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details