కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న వారిని ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే మద్యం, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొన్నట్లు సీఐలు బి.నరసింహులు, శ్రీరామ్ తెలిపారు. నిందితులపై మొత్తం రెండు కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
రూ.5 లక్షలు విలువైన కర్ణాటక మద్యం పట్టివేత - Karnataka liquor confiscation in Hindupur
కర్ణాటక నుంచి అక్రమగా ఏపీలోని హిందూపురానికి మద్యం తీసుకొస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5 లక్షల విలువ చేసే మద్యం, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రూ.5 లక్షలు విలువైన కర్ణాటక మద్యం పట్టివేత
చిలమత్తూరు మండలం శెట్టిపల్లి, వీరాపురం ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్న సందర్భంగా మద్యంతో పాటు కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐలు ఫణీంద్రనాథ్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సరోజాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి:తోటి విద్యార్థులు ఆట పట్టిస్తున్నారని..