తెలంగాణ

telangana

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Apr 15, 2021, 2:00 PM IST

పేదలకు పంచాల్సిన రేషన్​ బియ్యం పక్కదోవ పడుతోంది. నిత్యం ఏదో చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చట్ట వ్యతిరేక చర్యలకు కఠిన శిక్షలుంటాయని పోలీసులూ హెచ్చరిస్తున్నప్పటికీ... అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. కరీంనగర్​ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

Karimnagar district Kottapalli police seized PDS rice
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యం పట్టివేత

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడగ జంగాల కాలనీలో పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు. మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు చేశామని ఎస్ఐ ఎల్లా గౌడ్ తెలిపారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి.. బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లా గౌడ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:నీటి కుంటలో శవంగా తేలిన భర్త.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య.!

ABOUT THE AUTHOR

...view details