సీతమ్మ తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ విషయంపై సినీ నటి, భాజపా నాయకురాలు కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరామ నవమి రోజున సీతమ్మపై శ్రీనాథ్ చౌదరి అనే వ్యక్తి అనుచిత వాఖ్యలు చేశారని పేర్కొంది.
సీతమ్మపై అసభ్య పదజాలంతో మాట్లాడటం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఆ వాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. శ్రీనాథ్‌పై సైబర్ క్రైం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిందితుడి గాలింపు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు.