ఆరు సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కేసు (Kidnap Case)ను కంచన్బాగ్ పోలీసులు (Kanchanbhag Police) ఛేదించారు. చిన్నారిని సురక్షితంగా కాపాడి పాప తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ పాతబస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్ ప్రాంతంలో ఆరు సంవత్సరాల వయసున్న అల్ఫియాను ఓ మహిళ ఆటోలో తీసుకొని పారిపోయింది. బాధిత తల్లి కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే రంగంలోకి దిగిన కంచన్బాగ్ పోలీసులు... సంతోశ్నగర్ డివిజన్ పోలీసుల సహాయంతో ఈరోజు తెల్లవారు జామున షాద్నగర్ ప్రాంతంలో నిందితురాలిని అదుపులోకి తీసుకొని చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
సాయం ఆశ చూపి...
అంబర్పేట ప్రాంతానికి చెందిన ముస్కాన్ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఈమెకు ఆరు సంవత్సరాల కూతురు అల్ఫియా ఉంది. సోమవారం చంచల్గూడ సిగ్నల్ వద్ద భిక్షాటన చేసుకుంటుండగా... ఓ మహిళ ఆమె వద్దకు వచ్చింది. తన పేరు ఫాతిమాగా పరిచయం చేసుకుని... తనకు తెలిసినవారు బాబానగర్ ప్రాంతంలో పేదవారికి ఆర్థిక సహాయం చేస్తున్నారని నమ్మబలికింది. తల్లి కూతురును ఆటోలో బాబానగర్ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఓ ఇంటి గేట్ చూపించి తల్లిని వెళ్లమని పంపింది. పాప తల్లి ఇంట్లోకి వెళ్లగానే సదురు మహిళ చిన్నారిని తీసుకొని ఉడాయించింది.