Kalyana Lakshmi Funds Fraud: ఆమెకు వివాహం జరిగింది 2021 ఏప్రిల్ నెలలో.. కానీ ఆమెకు కల్యాణ లక్ష్మి నిధులు విడుదలైంది మాత్రం 2018లోనే. ఆశ్చర్యంగా ఉన్నా ఇచ్చోడ మండలం బావోజిపేట్ గ్రామానికి చెందిన ఏత్మాబాయికి ఈ పరిస్థితి ఏర్పడింది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన మెస్రం ఉత్తంతో 2021 ఏప్రిల్‌లో వివాహమైంది. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కోసం ఇటీవల దరఖాస్తు చేసేందుకు ఇచ్చోడకు వెళ్లగా.. ఇది వరకే ఆమె ఆధార్ నంబరుపై కల్యాణలక్ష్మి నిధులు తీసుకున్నట్లు చూపించడంతో అవాక్కయ్యారు. దీంతో పూర్తి వివరాలు ఆరా తీయగా.. 2018లోనే ఆమె ఆధార్‌పై నేరడిగొండ మండలం కుప్టి గ్రామానికి చెందిన నిఖిత అనే మహిళ పేరుమీద కల్యాణలక్ష్మి నిధులు మంజూరైనట్లు చూపించింది.
Kalyana Lakshmi Funds Fraud: పెళ్లికి ముందే 'కల్యాణలక్ష్మి'... పక్కా ప్లాన్‌తో కొట్టేశారిలా!!
Kalyana Lakshmi Funds Fraud: ఆడపిల్లల తల్లిదండ్రులకు వారి పెళ్లి భారం కాకూడదని.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం అందరికీ అందట్లేదు. అసలైన లబ్దిదారుల పేరిట.. ఆధార్ కార్డ్ నంబర్లతో అక్రమార్కులు నిధులు మళ్లీస్తున్నారు. విషయం తెలుసుకున్న అసలు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం విచారణ చేసి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
జిల్లాలోనే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కుంభకోణం 2020లో సంచలనంగా మారిన విషయం విదితమే. ఇదే అక్రమాల్లో ఏత్మాబాయి ఆధార్ నంబరుపై నిధులు స్వాహా చేయడంతో ఆమె లబోదిబోమంటున్నారు. తమకు తెలియకుండానే తమ ఆధార్ నంబరుతో నిధులు కాజేశారని, అధికారులు దృష్టి సారించి తమకు ప్రభుత్వ పథకం అందేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దార్ రామారావును వివరణ కోరగా బాధితులు తమకు ఫిర్యాదు చేశారని, ఈ సమస్యను జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఇదీ చూడండి:Khammam Unemployed Suicide : 'ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తోంది'