CHILD PORN ACCUSED ARRESTED: చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్న ఇద్దరు యువకులను ఏపీలో కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన శ్రీకాంత్, రాజంపేటకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన ఫోర్న్ వీడియోలను చూడటమే కాకుండా.. వాటిని ఇతరులకు డబ్బు కోసం షేర్ చేశారని ఎస్పీ వెల్లడించారు.
CHILD PORN ACCUSED: చైల్డ్ పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న నిందితుల అరెస్ట్ - చైల్డ్ పోర్న్ అప్‌లోడ్ చేస్తున్న నిందితుల అరెస్ట్
CHILD PORN ACCUSED: చిన్న పిల్లల పోర్న్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్న ఇద్దరు యువకులను ఏపీలో కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన శ్రీకాంత్, రాజంపేటకు చెందిన నవీన్ కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఐటీ చట్టం ప్రకారం కేంద్రంలో సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమై... జిల్లా సైబర్ టీంకు సమాచారం అందించడంతో ఈ కేసులను చేధించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి పోర్న్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తే నేరంగానే పరిగణిస్తామన్న ఎస్పీ... ఇలాంటి వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రజలు డిజిటల్ వేదికలను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. గతంలో కూడా 200 మంది మహిళలను ఓ యువకుడు ఈ విధంగానే వేధించాడని.. అతనిపై పీడీయాక్టు కూడా నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఫోర్న్ వీడియోలు చూసినా, ఇతరులకు పంపినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: