తెలంగాణ

telangana

ETV Bharat / crime

Sirpurkar Commission: 'కాల్పుల అలికిడి విని.. నేరుగా వాళ్ల పైకి ఫైరింగ్ జరిపారా..?' - దిశ హత్యాచారం కేసు

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో(Disha encounter case) జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ (Justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. కమిషన్‌ ఎదుట దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న కానిస్టేబుల్‌ రవి హాజరు కాగా.. కమిషన్ ప్రశ్నలు కురిపించింది.

Sirpurkar Commission
జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్

By

Published : Nov 9, 2021, 8:26 AM IST

Updated : Nov 9, 2021, 8:56 AM IST

నిందితులు చీకట్లో ఉండి కాల్పులు జరిపితే కేవలం ఆ అలికిడి విని… నేరుగా వాళ్ల పైకి కాల్పులు జరిపారా అని దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ (Justice sirpurkar commission)లో పాల్గొన్న కానిస్టేబుల్ రవిని… సిర్పుర్కర్‌ కమిషన్ ప్రశ్నించింది. నిందితులు పారిపోతూ తుపాకులు లాక్కున్నారనీ.. చీకట్లో నుంచి రాళ్లు కూడా విసిరారని.. అటు వైపు ఒకేసారి ఎక్కువగా కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారని.. కానిస్టేబుల్ రవి, కమిషన్ (Justice sirpurkar commission)​కు వివరించారు.

సీఐ నర్సింహా రెడ్డిని మరోసారి కమిషన్ (Justice sirpurkar commission) ప్రశ్నించింది. తుపాకి పౌచ్​లో నుంచి తుపాకీని ఎలా లాక్కెళ్లారనీ.. కమిషన్ (Justice sirpurkar commission) గత వారం సీఐ నర్సింహా రెడ్డిని ప్రశ్నించింది. ఎలా లాక్కెళ్లారో చూపించాలని కమిషన్ కోరింది. తుపాకి పౌచ్​ను ఫోరెన్సిక్ లాబ్​లో ఉంచారని.. నరసింహ రెడ్డి కమిషన్ (Justice sirpurkar commission)​కు తెలిపారు. పౌచ్​ను ఫోరెన్సిక్ లాబ్ నుంచి తెప్పించిన కమిషన్ (Justice sirpurkar commission).. నరసింహ రెడ్డిని పిలిపించి మరోసారి ప్రశ్నించారు. నిందితులు తన తుపాకీని పౌచ్​లో నుంచి ఎలా లాక్కు పోయింది సీఐ నర్సింహా రెడ్డి కమిషన్​ (Justice sirpurkar commission)కు చూపించారు. కాల్పుల్లో గాయపడ్డ ఎస్సై వెంకటేశ్వర్లును కమిషన్ (Justice sirpurkar commission) ప్రశ్నించింది. మంగళవారం కూడా వెంకటేశ్వర్లును కమిషన్ ప్రశ్నించనుంది.

ఇదీ చూడండి:Sirpurkar Commission: జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణకు విరామం.. ఎందుకంటే!

disha encounter case: 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?'

Last Updated : Nov 9, 2021, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details