తెలంగాణ

telangana

ETV Bharat / crime

justice sirpurkar commission: దిశ ఎన్‌కౌంటర్‌ కేసులో సజ్జనార్‌ విచారణ వాయిదా.. - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసుపై ఎన్‌హెచ్చార్సీ బృందాన్ని సిర్పూర్కర్ కమిషన్(justice sirpurkar commission) ప్రశ్నిస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సజ్జనార్ విచారణ వాయిదా పడింది.

justice sirpurkar commission, sajjanar
దిశ ఎన్‌కౌంటర్‌ కేసులో సజ్జనార్‌ విచారణ వాయిదా, దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసు

By

Published : Sep 29, 2021, 1:46 PM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్(sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్(disha encounter case sajjanar)... కమిషన్ ముందు ఇవాళ హాజరుకావాల్సి ఉంది. కానీ ఎన్‌హెచ్చార్సీ బృందంపై విచారణ పూర్తి కాకపోవడంతో మరో రోజు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన బృందాన్ని కమిషన్ ప్రశ్నిస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పలు విషయాలను ఇప్పటికే సేకరించిన కమిషన్(justice sirpurkar commission).. అఫిడవిట్‌లోని అంశాలను ప్రస్తావిస్తోంది.

ఎన్‌హెచ్చార్సీపై అసహనం

ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించకపోవడం, నిందితుల ఎదురు కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి వాంగ్మూలం సేకరించకపోవడంపై ఎన్‌హెచ్చార్సీ బృందంపై సిర్పూర్కర్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమావళి ప్రకారం సేకరించిన వివరాల గురించి కమిషన్ సభ్యులు అడిగారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను కమిషన్ బుధవారం విచారించే అవకాశం ఉంది.

కోర్టును ఆశ్రయించిన కుటుంబసభ్యులు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం విదితమే. అయితే తమ వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించలేదని... పోలీసులే కావాలని ఎన్​కౌంటర్​ చేసినట్లు మృతుల కుటుంబసభ్యులుకోర్టును ఆశ్రయించారు. దీనిలో భాగంగా సిర్పూర్కర్ కమిషన్ (justice sirpurkar commission) విచారణను వేగవంతం చేసింది. కమిషన్ ముందు మృతుడు చెన్నకేశవులు భార్య హాజరయ్యారు. చెన్నకేశవులు సరిగా నడవలేడని... అలాంటి వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని ఎలా పారిపోగలడని... వాంగ్మూలం ఇచ్చింది. తనకు తగిన న్యాయం చేయాలని కమిషన్​ను కోరింది. దిశ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుకతో పాటు... చెన్నకేశవులు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా కమిషన్ గతంలో ప్రశ్నించింది.

అపూర్వారావును ప్రశ్నించిన కమిషన్

‘దిశ’ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలో పాల్గొన్న పోలీసులు వినియోగించిన తూటాల లెక్క తేల్చేందుకు సంబంధిత ఠాణాల్లోని ఆయుధాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారా? అని వనపర్తి ఎస్పీ అపూర్వారావును సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇదివరకే ప్రశ్నించింది. తనిఖీ చేయలేదని ఆమె బదులిచ్చారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఏర్పాటైన సిట్‌కు సంబంధించి కేస్‌ డైరీ రాసిన అపూర్వారావును కమిషన్‌ ఇప్పటికే విచారించింది.

ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆరా

ఎన్‌కౌంటర్‌లో(disha encounter case) గాయపడినట్లుగా చెబుతున్న పోలీసులకు చికిత్స చేసిన ఆసుపత్రిని సందర్శించిన సమయంలో క్షతగాత్రులు ఐసీయూలో ఉన్నారా? సాధారణ వార్డులో ఉన్నారా అని ప్రశ్నించగా.. సాధారణ వార్డులోనే ఉన్నారని ఆమె బదులిచ్చారు. తీవ్రమైన గాయాలతో ఉన్నారని సిట్‌ నివేదికలో ఉందని.. అలాంటి వారిని సాధారణ వార్డులో ఎలా ఉంచారని కమిషన్‌ సభ్యులు ప్రశ్నించారు. ఐసీయూ, ఐసీసీయూ, సాధారణ వార్డులకు తేడా తెలుసా అని అసహనం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details