తెలంగాణ

telangana

ETV Bharat / crime

డోలీ కట్టి గర్భిణీ తరలింపు.. పుట్టిన కాసేపటికే మగబిడ్డ మృతి - మన్యంలో డోలీ కట్టి గర్భిణీ తరలింపు

స్వాతంత్య్రం సిద్దించి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ.. మన్యంలో మారుమూల గ్రామాలకు సరైన రహదారి సదుపాయం లేదు. పురిటి నొప్పులు వస్తే డోలీమోతలు తప్పడం లేదు. ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమై.. తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లికి కడుపుకోత మిగిల్చిన సంఘటనలెన్నో జరుగుతున్నాయి.

just born baby boy died in vizag
డోలీ కట్టి గర్భిణీ తరలింపు

By

Published : Jul 16, 2021, 9:41 AM IST

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోగల బూసిపుట్‌ పంచాయతీ సుల్తాన్‌పుర్ గ్రామ ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. గ్రామానికి చెందిన పాంగిచెల్లామ్మ నిండు గర్భిణి. ఆమె మూడు రోజులుగా పురిటి నొప్పులతో బాధ పడుతోంది. గురువారం రోజున.. నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించాలనుకున్నారు.

అలిసిపోయి రోడ్డుపై కూలబడ్డ గర్భిణి

డోలీపై..

ఆ వాహనం కాస్త.. ఘాట్ రోడ్డున బురదలో నిలిచిపోయింది. ఇక చేసేదేం లేక కుటుంబీకులు కొంత దూరం డోలీమీద.. మరికొంత దూరం ఎత్తుకుని ఇంకొంత దూరం ఇద్దరు ఉపాధ్యాయుల సాయంతో ద్విచక్రవాహనంపై తరలించారు. అనంతరం ఓ ప్రైవేటు వాహనం మాట్లాడుకుని 108కి సమాచారం అందించారు.

గర్భిణిని మోసుకెళ్తున్న వ్యక్తి

కడుపుకోతే మిగిలింది..

అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అదే ప్రైవేటు వాహనంలో రూడకోట పీహెచ్‌సీకి తరలించారు. పరస్థితి విషమిండంతో మెరుగైన వైద్యం కోసం ముంచంగిపుట్టు వద్ద గల పీహెచ్​సీకి తీసుకెళ్లారు. ఇంత చేసినా ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా.. ఆ బాలుడు మరణించాడు. సరైన రహదారులు లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మారుమూల గ్రామాలకు రాకపోకలు సుగమం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:మన్యంలో తుపాకులు వదిలి.. పాఠాలు చెబుతున్న ఖాకీలు!

ABOUT THE AUTHOR

...view details