ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విద్యార్థి నేతలు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టు రాసి కోర్టుకు సమర్పించారు.
సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు ! - సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు
ఏపీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై అత్యాచారయత్నం కింద తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించగా.. రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసు !
రిపోర్టు చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసా ? అని ప్రశ్నించారు. నాలుక్కరుచుకున్న పోలీసులు రిమాండ్ రిపోర్టు మార్చి మళ్లీ న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్టులో సెక్షన్లు సరిగానే నమోదు చేసినప్పటికీ.. రేప్ అటెంప్ట్ అనే పదాలు వాడటంతో న్యాయమూర్తి ఆగ్రహానికి గురయ్యారు.
ఇదీ చదవండి: ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్య