తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉద్యోగార్థులు బీ అలెర్ట్​: నకిలీ వెబ్​సైట్లు ఉన్నాయట.. దరఖాస్తు చేసుకునేప్పుడు జాగ్రత్త..!

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో పాటు జాతీయ హెల్త్‌మిషన్‌ సహకారంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు అంతర్జాలంలో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వెబ్‌సైట్లను సృషించారు. ఆయా శాఖల అధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా... నకిలీ వైబ్‌సైట్‌లను అంతర్జాలం నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

Job aspirants alert Cybercriminals created Telangana State Level Recruitment Board fake website
Job aspirants alert Cybercriminals created Telangana State Level Recruitment Board fake website

By

Published : May 1, 2022, 5:05 AM IST


రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖలో చేపట్టనున్న నియామకాలను నిర్వహిస్తున్న "తెలంగాణ స్టేట్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు" పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వెబ్‌సైట్‌ను సృషించారు. డీజీపీ కార్యాలయంలోని రిక్రూట్‌మెంట్‌బోర్డు విభాగం అధికారులు ఆన్​లైన్​లో ఈ నకిలీ వైబ్‌సైట్‌ ఉన్నట్టు గుర్తించారు. ఈ వెబ్‌సైట్‌ను పరిశీలించిన అధికారులు శుక్రవారం(ఏప్రిల్​ 29) రాత్రి హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నకిలీ వైబ్‌సైట్‌ను అంతర్జాలంలోంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన సైబర్‌ నేరస్థులు ఎవరన్నది తెలుసుకునేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖతో సహా ప్రత్యేక పోలీస్‌విభాగం, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో వేర్వేరు స్థాయిల్లో 16614 పోస్టులను భర్తీచేసేందుకు తెలంగాణ రాష్ట్ర రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏప్రిల్‌ 25న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. మే 2 నుంచి మే 20వరకూ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లలో సూచించారు. సరిగ్గా ఇదే తరహాలో నకిలీ వైబ్‌సైట్‌ అంతర్జాలంలో ఉంటే... అభ్యర్థులు పొరపాటున నకిలీ వైబ్‌సైట్‌ను తెరిచి అందులో దరఖాస్తు చేసుకుంటే అసలుకు మోసం వస్తుంది. అంతేకాక.. నకిలీ వైబ్‌సైట్‌లో తప్పుడు వివరాలుంటే.. అభ్యర్థులు వాటినే అనుసరించే అవకాశాలున్నాయని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా నకిలీవెబ్‌సైట్‌ను తొలగించేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో జాతీయ హెల్త్‌మిషన్‌ సహకారంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సైబర్‌ నేరస్థులు అంతర్జాలంతో పాటు, పత్రికల్లోనూ తప్పుడు నియామక ప్రకటనలు ఇచ్చారు. మూడురోజుల క్రితం ఈ విషయాన్ని గుర్తించిన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ హెల్త్‌మిషన్‌లో స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ఫార్మసీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలంటూ ఆయా ప్రకటనల్లో సైబర్‌ నేరస్థులు పేర్కొన్నారు. జాతీయ హెల్త్‌మిషన్‌ ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టలేదని.. అభ్యర్థులు మోసపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే చర్యలు చేపట్టాలంటూ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పోలీసులను అభ్యర్థించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details