తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి సంజయ్​ కుమార్​ అరెస్ట్​..

హైదరాబాద్​కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్​ను కోల్​కతా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. సుంకం మినహాయింపుతో బంగారాన్ని దిగుమతి చేసుకొని... అక్రమంగా చెలామణి చేశారని సంజయ్ కుమార్​పై అభియోగం.

ed arrest
ed arrest

By

Published : Nov 29, 2021, 10:38 PM IST

హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్​ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పుణెలో ఓ వివాహానికి వెళ్తుండగా సంజయ్ కుమార్ అగర్వాల్​ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోల్​కతా కోర్టులో హాజరు పరిచారు. సంజయ్ కుమార్ అగర్వాల్​ను కోల్​కతా కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆయనపై కోల్​కతా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ పెండింగులో ఉంది. మూడేళ్ల క్రితం సంజయ్ కుమార్ అగర్వాల్, ఆయన కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్​పై కోల్​కతాలో డీఆర్ఐ కేసు నమోదు చేసింది.

ఎగుమతుల పేరిట ఎంఎంటీఎస్, డైమండ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సుంకం మినహాయింపు ఉన్న బంగారం దిగుమతి చేసుకున్న సంజయ్ కుమార్ అగర్వాల్.. అక్రమంగా దేశీయంగా చెలామణి చేసినట్లు అభియోగం. డీఆర్ఐ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న కోల్​కతా ఈడీ అధికారులు.. గతంలో ప్రీత్ కుమార్ అగర్వాల్​ను అరెస్టు చేసింది. సుమారు 54 కిలోల బంగారం, 25 కోట్ల రూపాయల విలువైన మూడు స్థిరాస్తులు, బ్యాంకుల్లోని 56 లక్షల రూపాయలను ఈడీ ఇప్పటికే తాత్కాలిక జప్తు చేసింది. సంజయ్ ముందస్తు బెయిల్​ను ఇటీవల కలకత్తా హైకోర్టు కొట్టివేసింది.

ఇదీ చూడండి:Gold seized: క్యాటరింగ్ ఉద్యోగి వద్ద కోటి రూపాయల బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details