Jewelery Theft in a Government School: తిరుపతి జిల్లాలో ఓజిలి మండలం వాకాటివారి కండ్రిగ మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక పాఠశాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ఎన్నుకున్నారు. ఈ గ్రామంలోని ప్రజలందరూ ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లిపోతారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు దొపిడి దొంగలు బైక్పై అక్కడే రోడ్డు ఆనుకుని ఒకే ఆవరణలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
ఒకరు బైక్పై కూర్చుని సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు యువకులు నేరుగా పాఠశాల గదుల వద్దకు వెళ్లారు. వారిని చూసి ఎవరో విద్యాశాఖ అధికారులు తనిఖీ నిమిత్తం వస్తున్నారని ఉపాధ్యాయురాలు, అంగన్వాడీ కార్యకర్త ముందుకు వచ్చారని తెలిపారు. చోరీ కోసం వచ్చిన ఆ ఇద్దరు యువకులు వెంటనే కత్తి తీసి వారి మెడపై పెట్టడంతో అరవలేకపోయారు. వీరు వేర్వేరు గదుల్లో ఉండటంతో భయపడిపోయామని తెలిపారు.