Imprisonment to Police: కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. గతేడాది జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
ఆ కేసులో నలుగురు పోలీసు అధికారులకు జైలుశిక్ష.. - హైకోర్టు
15:15 June 06
కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలుశిక్ష
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసినట్లు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. వాదనల అనంతరం జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ నరేశ్‌కు నాలుగు వారాలు జైలుశిక్ష విధించింది. నలుగురిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పీలుకు వెళ్లేందుకు వారికి శిక్ష అమలును 6 వారాలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
ఇవీ చదవండి:జూబ్లీహిల్స్‌లో దారుణ హత్య... భార్య మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి..
ఇకపై నెలకు 24 ట్రైన్ టికెట్లు బుక్ చేసే వీలు.. కానీ ఓ షరతు!