Child Kidnap: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి చిన్నారిని అపహరించి.. రోడ్డుపైనా పడుకోబెట్టి ఉండగా పోలీసులు అతడిని పట్టుకుని పీఎస్కు తరలించి చిన్నారిని సఖి కేంద్రానికి పంపించారు. వివరాలలోకి వెళ్తే జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి చిన్నారితో రోడ్డు పక్కన నిద్రిస్తున్నాడు. అటుగా వెళ్లిన పోలీసులు అనుమానం వచ్చి వివరాలు అడగగా.. ఆ వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించి విచారించగా అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ నుంచి పాపను కిడ్నాప్ చేసినట్టు నిందితుడు విచారణలో తెలిపాడు. నిందితుడిని నిర్మల్ జిల్లాకు చెందిన నక్క పోశెట్టిగా గుర్తించారు. చిన్నారిని కరీంనగర్లోని శిశు కేంద్రానికి పంపించారు.
ఆర్మూర్లో అదృశ్యమైన చిన్నారి, జగిత్యాలలో రోడ్డు పక్కన ఇలా - అపహరణకు గురైన చిన్నారిని గుర్తించిన పోలీసులు
Child Kidnap శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించాల్సిన ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన చిన్నారితో అనుమానాస్పదంగా నిద్రిస్తున్నాడు. అటుగా వెళ్లిన పోలీసు అధికారులు గుర్తించడంతో ఆ చిన్నారి సేఫ్గా బయటపడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Child Kidnap
చిన్నారి విషయమై ఆర్మూర్ పోలీసులకి సమాచారం అందించగా అక్కడకి వచ్చారు. పాప తన కూతురెనంటూ గోశమల్ల పోసాని రాగా, తన కూతురే కావచ్చని మరో మహిళ ఫోన్ చేసి చెప్పింది. దీంతో చిన్నారి విషయమై సంక్షేమాధికారులు ఎవరికి ఇవ్వాలో తెలియక తమ వద్దే ఉంచుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: