తెలంగాణ

telangana

ETV Bharat / crime

జీహెచ్​ఎంసీ ఉద్యోగినంటూ డ్రైవర్​ మోసం..

అతనో డ్రైవర్​.. కానీ నగరపాలక సంస్థలో ఉద్యోగినంటూ పలువురిని బురిడీ కొట్టించాడు. పలు దుకాణాల యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. స్థానికుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్టలో ఈ సంఘటన జరిగింది.

driver cheating in jagadgirigutta
జగద్గిరి గుట్టలో డ్రైవర్​ మోసం

By

Published : Mar 25, 2021, 7:15 PM IST

మున్సిపల్ ఉద్యోగినంటూ పలు దుకాణాల్లో వసూళ్లకు పాల్పడిన డ్రైవర్​ను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాస్​నగర్​కు చెందిన వెంకటేష్.. మంగళవారం రోడా మేస్త్రీ నగర్​లో ఉన్న ఓ బేకరీ వద్దకు వెళ్లి తాను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. బేకరీలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నందున రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఇలా పలు దుకాణాల్లో యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు అతడిపై స్థానికంగా నివసించే జితేందర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు వెంకటేష్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:ఆర్‌ అండ్‌ బీ శాఖలో రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం: ప్రశాంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details