IT employee selling Ganja: యువకులు, ఐటీ నిపుణుల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు అరకు నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని కొండపనేని మాన్సీని బోయిన్‌పల్లి పోలీసులు గురువారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేశారు. నాచారంలో ఉంటూ ఓ ఎంఎన్‌సీ(ఐటీ)లో పనిచేస్తున్న మాన్సీ.. భర్త మదన్ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది.
IT employee selling Ganja: గంజాయి విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని - ఐటీ ఉద్యోగి
IT employee selling Ganja: ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఏవరైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు సంపాదించాలనుకుంటారు. ఏ కంపెనీ ఎక్కువ జీతం ఇస్తుందో అటు వెళ్లడానికి మొగ్గు చూపుతారు. కానీ ఈమె మాత్రం నా రూటే సపరేటు అన్నట్టు.. అందరిలా వెళ్లకుండా కొత్త మార్గంలో వెళ్లాలనుకుంది. మొదట్లో బాగానే కలిసొచ్చిన.. తర్వాత అసలు విషయం బయటపడడంతో చివరికీ జైలులో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ ఐటీ ఉద్యోగిని ఏం చేసిందనుకుంటున్నారా..!
మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 1.2 కిలోల గంజాయితో యువకులిద్దరూ చిక్కగా దంపతులు పారిపోయారు. వారిచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి వద్ద గురువారం మాన్సీని పట్టుకున్నారు. ఏపీకి చెందిన ఆమె పూర్వీకులు నాగ్‌పుర్ జిల్లాలో వ్యవసాయంలో స్థిరపడ్డారు. భోపాల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా భర్తతో కలిసి ఉంటోందని ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు.