IT Notices to Varla Ramaiah: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. టీడీపీ ఫిర్యాదులపై స్పందించిన ఐటీ శాఖ.. తమ వద్దనున్న సమాచారం అందించాల్సిందిగా వర్ల రామయ్యకు నోటీసులిచ్చింది. కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ ఆరోపణలు చేసింది.
గుడివాడ క్యాసినో వ్యవహారం.. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ - గుడివాడ క్యాసినోపై ఈడీకి టీడీపీ ఫిర్యాదు
IT Notices to Varla Ramaiah: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గుడివాడ క్యాసినో అంశంపై ఐటీ శాఖ స్పందించింది. కొడాలి నాని, వంశీలపై సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు టీడీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ.. సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యకు నోటీసులు జారీచేసింది. క్యాసినో విషయంలో తమ వద్దనున్న సమాచారం అందించాల్సిందిగా సూచించింది.
IT Notices
గుడివాడ క్యాసినో అంశంపై కొడాలి నాని, వంశీలపై సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ సమాచారం సేకరణలో భాగంగా ఈ నెల 19వ తేదీన హాజరై.. సమాచారమివ్వాలని వర్ల రామయ్యకు సూచించింది.
ఇవీ చదవండి: