హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తార్నాక ఎర్రగుంట రోడ్‌లో హాష్ ఆయిల్ క్రయవిక్రయాలు చేస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు, నార్కోటిక్ వింగ్ పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్ట్‌లు చేసింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో హాష్ ఆయిల్ అమ్ముతున్న ఇద్దరు... కొనుగోలు చేసిన 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 11 మందిని అరెస్టు చేసి.. 24 సీసాల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్‌ను విశాఖ నుంచి తెచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేసిన వారిలో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం...
తార్నాకలో నార్కోటిక్ అధికారుల సోదాలు.. 11 మంది అరెస్టు
తార్నాకలో నార్కోటిక్ అధికారుల సోదాలు.. 11 మంది అరెస్టు
09:03 April 06
తార్నాకలో నార్కోటిక్ అధికారుల సోదాలు
Last Updated : Apr 6, 2022, 12:59 PM IST