కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పలు హత్య కేసుల్లో నిందితుడైన రాంటెంకి ప్రణీత్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈకేసును పట్టణ ఎస్‌హెచ్‌వో మోహన్, ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగజ్‌నగర్ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు - కాగజ్‌నగర్‌లో హత్య
రెండు రోజుల క్రితం జరిగిన హత్యకేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పాత కక్షలతో రాంటెంకి ప్రణీత్‌ను హతమార్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగజ్‌నగర్ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు
సీసీ టీవీల ఆధారంగా..
మంగళవారం రాత్రి ఒక మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణే హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. మాట మాట పెరిగి తీరందాజ్ బస్తీకి చెందిన రాంటెంకి ప్రణీత్‌ను కత్తితో పొడిచి.. బండ రాయితో మోదీ హత్య చేశారు. అదే కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇద్దరు లేదా ముగ్గురు హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మృతుడు పలు హత్యకేసుల్లో నిందితుడు కాగా.. ఇటీవలే బెయిల్‌పై వచ్చాడు.