తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape Case : హైదరాబాద్​లో యువతిపై అత్యాచారం.. వైద్యపరీక్షల్లో ఏం తేలిందంటే! - police investigation on young woman rape case

హైదరాబాద్​లో యువతిపై అత్యాచారం.. జరిగిందా? లేదా?
హైదరాబాద్​లో యువతిపై అత్యాచారం.. జరిగిందా? లేదా?

By

Published : Aug 19, 2021, 9:42 AM IST

Updated : Aug 19, 2021, 10:36 AM IST

09:38 August 19

Rape Case : హైదరాబాద్​లో యువతిపై అత్యాచారం.. వైద్యపరీక్షల్లో తేలిన నిజం

తనపై అత్యాచారం జరిగిందంటూ హైదరాబాద్​లోని సంతోష్​నగర్​ పీఎస్​లో యువతి ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు భావిస్తున్నారు. యువతి చెప్పిన దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. సంతోష్ నగర్​లోని  ల్యాబ్​లో పనిచేస్తున్న యువతి ఎప్పటిలాగా ఈనెల 17న రాత్రి..  సంతోష్​నగర్ నుంచి చాంద్రాయణగుట్ట ఫిసల్‌బండలోని తన ఇంటికి ఆటోలో బయలుదేరింది.

గంట ఆలస్యంగా ఇంటికి.. 

ల్యాబ్ నుంచి రాత్రి 9.30కి ఇంటికి రావాల్సిన యువతి 10.30 నిమిషాలకు వెళ్లగా.. తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ సమయంలోనే యువతి తనపై ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. కంగారుపడిన తల్లిదండ్రులు సంతోష్ నగర్ పోలీసులకు 18 తేదీన మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు.  యువతి ఆటో ఎక్కిన సమయానికి.. ఆమె చెప్పే విషయాలకు పొంతన లేకపోవడంతో ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఎక్కడా పొంతన కుదరకపోవడం.. 

ఘటన జరిగిందని యువతి చెప్పిన ప్రదేశానికి కారులో వెళ్లి వచ్చేందుకే పోలీసులకు సుమారు 3 గంటలు సమయం పట్టింది. అయితే రాత్రి 9.30కి ఇంటికి రావాల్సిన యువతి 10.30కి ఇంటికి చేరుకుంది. దీంతో ఆమె తప్పుడు ఫిర్యాదు చేసిందని పోలీసులు భావిస్తున్నారు. యువతిపై అత్యాచారం జరగలేదని వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అయితే అత్యాచారం జరిగినట్లు యువతి ఎందుకు ఫిర్యాదు చేసిందనే దానిపై ఆరా తీస్తున్నారు.  

Last Updated : Aug 19, 2021, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details