Interstate Thief Arrested: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో దొంగతనానికి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగ చీకట్ల లక్ష్మణ్.. అతనికి సహకరిస్తున్న మరో మహిళ పెద్దగమళ్ల విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.30వేలు నగదు, సుమారు రూ.6లక్షల 75 వేల విలువగల 150 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆయన దొంగలిస్తాడు.. ఆమె అమ్మి పెడుతుంది.. చివరకు.. - నేర వార్తలు
Interstate Thief Arrested: కొద్దిరోజుల క్రితం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో దొంగతనానికి పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగతో పాటు అతనికి సహకరిస్తున్న మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.6లక్షల 75 వేల విలువగల 150 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దొంగతనాలు
గతంలో వీరు తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలు చేసినట్లు ఏసీపీ మారగాని రమేష్ తెలిపారు. కొంతకాలంగా పగటిపూట ఇళ్లల్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా లక్ష్మణ్ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. లక్ష్మణ్ దొంగిలించిన ఆభరణాలను విజయలక్ష్మి.. అమ్మి సొమ్ము చేస్తుంది. వీరిరువురికి పలు రాష్ట్రాల్లో సుమారు 30 నేరాల్లో పాత్ర ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు.
ఇవీ చదవండి: