తెలంగాణ

telangana

ETV Bharat / crime

మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్: సీపీ - karimnagar district latest news

వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. బంగారు ఆభరణాలు మెరుగుపెడతామంటూ మభ్యపెడతారు. మాటల్లో పెట్టి నగలతో ఉడాయిస్తారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కరీంనగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Interstate gang members arrested by karimnagar police
మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు అరెస్ట్: సీపీ

By

Published : Mar 15, 2021, 10:49 PM IST

దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని పట్టుకున్నట్లు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. బిహార్​లోని​ భగల్‌పూర్‌ జిల్లాకు చెందిన ఆరిఫ్‌తో పాటు ముకేశ్​ పాషాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఈ ముఠా పంజాబ్, హరియాణా, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన రాష్ట్రంలోనూ దొంగతనాలకు పాల్పడింది. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి ఆభరణాలను మెరుగు పెడతామంటూ మోసం చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు.

- సీపీ కమలాసన్​రెడ్డి

నిందితుల వద్ద నుంచి 10 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఓ మోటార్ సైకిల్‌, మెరుగు పెట్టేందుకు ఉపయోగించే పౌడర్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. న్నారు. మిగతా ముగ్గురినీ త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: మిస్టరీ వీడిన హత్య కేసు.. బావమరిదే హంతకుడు

ABOUT THE AUTHOR

...view details