నకిలీ ఏటీఎం కార్డులతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్వాలలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే వారితో మాటలు కలిపి ఒరిజనల్ ఏటీఎం కార్డులు తస్కరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్దనుంచి రూ.39వేల నగదు, కారు, 41 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంల వద్ద మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
నగదు విత్డ్రా కోసం ఏటీఎంల వద్దకు వచ్చే వారిని మోసగిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాలలో ఏటీఎం వద్దకు వచ్చినవారితో మాటలు కలిపి నకిలీ కార్డులు ఇచ్చి మోసగిస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు వెల్లడించారు. వారి వద్దనుంచి రూ.39వేల నగదు, కారు, 41 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంల వద్ద మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
పట్టణంలో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలో ముగ్గురు సభ్యులున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశామని.. వారిలో ఒకరు హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఉన్నట్లు వెల్లడించారు. మరో వ్యక్తి తప్పించుకున్నట్లు జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు.