హైదరాబాద్ అత్తాపూర్లోని సీతారామచంద్ర దేవాలయానికి చెందిన భూముల్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కబ్జాదారుల చేతుల్లో ఉన్న 866 గజాల స్థలానికి హద్దులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఆయా స్థలాల్లో చేపడుతోన్న అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు.
ఆలయ భూముల్లో అక్రమ కట్టడాల అడ్డగింత - అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్ అత్తాపూర్లో దేవాలయ భూములను కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సీతారామచంద్ర ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో చర్యలు తీసుకున్నారు. భవిష్యత్లో ఆక్రమణలకు గురి కాకుండా సూచీలు ఏర్పాటు చేశారు.
Land occupiers
ఆలయ భూములను కొనుగోలు చేసి మోసపోవద్దని.. దేవాదాయ శాఖ కమిషనర్ కృష్ణ సూచించారు. అయితే రాజేంద్రనగర్ సర్కిల్లోని.. అత్తాపూర్, రాంబాగ్, హైదర్ గూడాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 150 ఏకరాలకు పైగా దేవాలయ భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:వ్యాక్సిన్ వేస్తామని నమ్మించి రూ.1.10 లక్షలు స్వాహా....