International sex racket and drug gang: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 14వేల మందికి పైగా దేశవిదేశాలకు చెందిన యువతులు, మహిళలు. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిల ఫోటోలు, ఫోన్‌నంబర్లు. ప్రకటనలు, వెబ్సైట్లు, కాల్‌సెంటర్లు, వాట్సాప్ నుంచే సాగుతున్న వ్యవహారం. ఫోన్‌చేస్తే చాలు విమానాల్లో ప్రయాణాలు, హోటళ్లలో ఆతిథ్యాలు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న భారీ వ్యభిచార ముఠా ఆటను సైబరాబాద్ పోలీసులు కట్టించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన మహిళలు, యువతులతో దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. ఎమ్డీఎమ్ఏ మాదకద్రవ్యాలు అలవాటు చేసి సెక్స్‌రాకెట్‌ను సాగిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా వెబ్సైట్లు, వాట్సప్‌ల ద్వారా ఈ ముఠా చీకటి దందాను నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. పలుప్రాంతాల్లో కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటు చేసి. ఆన్లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు.
వ్యభిచార కూపాలపై దాడులు నిర్వహించే క్రమంలో తీగలాగితే ఈ వ్యవహారం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నిందితులతో పాటు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్‌ను ముఠా నాయకుడిగా గుర్తించినట్లు చెప్పారు. వీరిని విచారించగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న చీకటి తతంగం బయటపడిందని డీసీపీ కవిత వెల్లడించారు.