Student suicide: హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుట్కా అలవాటు ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసింది. తండ్రికి ఈ విషయం తెలియడంతో భయపడిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాయంపేట మండలం ఆరెపల్లిలో చోటు చేసుకుంది.
Student suicide: తండ్రి మందలిస్తాడేమోనని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - ఆరెపల్లిలో విషాదం
Student suicide: తండ్రి మందలిస్తాడన్న భయంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లిలో జరిగింది.
![Student suicide: తండ్రి మందలిస్తాడేమోనని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య Student suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13972719-182-13972719-1640104280630.jpg)
Inter student: ఆరెపల్లికి చెందిన నాగలగాని రవి కూమారుడు భరత్.. ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహత్మాజ్యోతిరావు పూలే జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అయితే విద్యార్థి కళాశాల బయటకు వెళ్లి గుట్కాలు కొనుగోలు చేసి లోపలికి వస్తుండగా వాచ్‌మెన్ చూసి ఫొటో తీసి ప్రిన్సిపల్‌కు పంపించాడు. దీంతో ఆ ప్రిన్సిపల్ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి చెప్పగా కళాశాలకు వచ్చి మాట్లాడుతానని విద్యార్థి తండ్రి చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న భరత్... తండ్రి మందలిస్తాడేమో అన్న భయంతో కళాశాల నుంచి పారిపోయాడు. గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు వచ్చి అక్కడే ఉన్న పురుగుల మందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.