interior worker threaten in Jubleehills: ఇంటీరియర్ వర్కర్‌ను తుపాకీతో బెదిరించిన ఘటనలో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71లో బెంగళూరుకు చెందిన వ్యాపారి ధర్మ తేజ ఇంటిలో, బోరబండ వివేకానంద నగర్‌కు చెందిన ఓంకార్ అనే వ్యక్తి, ఇంటీరియర్ వర్క్ నిర్వహిస్తుండగా, వ్యాపారి ధర్మ తేజ వ్యక్తిగత సహాయ సిబ్బంది మద్యం సేవించి దాడి చేయడమే కాకుండా తుపాకితో బెదిరించినట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓంకార్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు వికాస్, రాజ్‌కుమార్, నిషు చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటీరియర్ వర్కర్‌కు మద్యం మత్తులో తుపాకితో బెదిరింపు
interior worker threaten in Jubleehills: జూబ్లీహిల్స్ లో బెంగళూరుకు చెందిన వ్యాపారి ధర్మ తేజ ఇంటిలో, ఓంకార్ అనే వ్యక్తి ఇంటీరియర్ పనులు నిర్వహిస్తుండగా, వ్యాపారి ధర్మ తేజ వ్యక్తిగత సహాయ సిబ్బంది మద్యం మత్తులో దాడి చేయడమే కాకుండా తుపాకితో బెదిరించినట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓంకార్ ఫిర్యాదు చేశాడు.
తుపాకీతో బెదిరింపు