జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను నిర్మల్ పట్ణణ పోలీసులు అరెస్టు చేశారు. భైంసా పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్, మహమ్మద్ హాఫీస్ ఉల్లాఖాన్, నిర్మల్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఉమార్, మహమ్మద్ సల్మాన్ హుస్సేన్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నిర్మల్, భైంసాల్లో ఇప్పటివరకు 13 బైక్‌లు అపహరించారు.
వాహనాల దొంగల ముఠా అరెస్ట్.. 13బైకులు స్వాధీనం - నిర్మల్ జిల్లాలో బైక్ దొంగలు అరెస్ట్
ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి దొంగల ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అపహరించిన 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
బైక్ దొంగలు అరెస్ట్
శుక్రవారం.. నిర్మల్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సై రమేష్ వాహనాలు తనిఖీ చేస్తుండగా మహమ్మద్ అన్వర్.. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్‌ల దొంగతనం వెలుగులోకి వచ్చింది. అన్వర్‌తో పాటు మిగతా ముగ్గురినీ అరెస్టు చేసి రూ. 7 లక్షల విలువైన 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
ఇదీ చదవండి:మైనర్ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి