తెలంగాణ

telangana

ETV Bharat / crime

సోదరితో అసభ్యంగా ప్రవర్తించాడని స్నేహితులతో కలిసి దాడి.. వీడియో వైరల్ - inter students fight viral in paderu

ATTACK ON INTER STUDENT: తన సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్నేహితులతో కలిసి ఓ ఇంటర్​ విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ATTACK ON INTER STUDENT
ATTACK ON INTER STUDENT

By

Published : Oct 27, 2022, 3:27 PM IST

INTER STUDENTS FIGHT VIRAL: ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకేంద్రం పాడేరులో అల్లరిమూకలు ఎక్కువవుతున్నాయి. రెండు రోజుల క్రితం భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు వేమన బాబుపై జరిగిన దాడి ఘటన మరువకముందే.. ఓ ఇంటర్ విద్యార్థిని, మరికొందరు విద్యార్థులు చితకబాదిన ఘటన వీడియో వైరల్ అయ్యింది.​ తన సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంతో స్నేహితులతో కలిసి.. పాడేరులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు.

సోదరితో అసభ్యంగా ప్రవర్తించాడని స్నేహితులతో కలిసి దాడి.. వీడియో వైరల్

ఏదైనా గొడవ జరిగితే ప్రిన్సిపల్​ లేదా పెద్దవారికి ఫిర్యాదు చేయాలి కానీ.. ఇలా అసభ్యకర పదజాలాలు వాడుతూ వీధిరౌడీల్లా ప్రవర్తించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిని బాధిత కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్యార్థి బంధువులు, కుటుంబీకులు కళాశాలకు వచ్చి ఆందోళనలు నిర్వహించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details