తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఖర్చులకు డబ్బులివ్వలేదని.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య - ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

చిన్న చిన్న విషయాలకే.. తీవ్ర మనస్తాపాలకు గురవుతున్నారు పిల్లలు. తల్లిదండ్రులు మందలించారనో.. పరిక్షల్లో పాస్‌ అవ్వలేదనో.. బంగారు భవిష్యత్‌ను లెక్క చేయకుండా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఇలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఇంటర్‌ విద్యార్థి.

inter student sucide in navabpeta mahabubnagar
ఖర్చులకు డబ్బులివ్వలేదని.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Feb 17, 2021, 10:11 AM IST

తల్లిదండ్రులు ఖర్చులకు డబ్బులివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్థి.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో చోటు చేసుకుంది.

కర్శాల మడుగు తండాకు చెందిన రాంజీ (18).. అవసరాలకోసం ఇంట్లో డబ్బులు అడిగాడు. తల్లిదండ్రులు లేవని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కోపంతో.. పొలానికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చేతికందివచ్చిన కుమారుడు.. విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. బంగారం లాంటి భవిష్యత్‌ ఉన్న యువకుడు.. చిన్న కారణంతో ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి:హాస్టల్​లో యువకుడు అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details