Inter Student Died: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఐలయ్య-మంజుల దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమారుడు సంతోష్ హసన్పర్తి మండలంలోని జయగిరి శివారులో ఉన్న బీసీ సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ప్రాణం తీసిన కబడ్డీ.. తలకు బలమైన గాయమై ఇంటర్ విద్యార్థి మృతి - కబడ్డీ వార్తలు
Inter Student Died: తోటి మిత్రులతో ఓ విద్యార్థి సరదాగా కబడ్డీ ఆడగా.. అదే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. కబడ్డీ ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ గాయపడిన విద్యార్థి చికిిత్స పొందుతూ మృతి చెందిన ఘటన దంతాలపల్లిలో చోటు చేసుకుంది.
ఈనెల 8వ తేదీన సంతోష్ కళాశాల ఆవరణలోని తోటి మిత్రులతో కలిసి కబడ్డీ ఆడాడు. ఈ క్రమంలో కిందపడిన సంతోష్ తలకు బలమైన గాయమైంది. కళాశాల సిబ్బంది అతనిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. తలలో రక్తం గడ్డ కట్టడంతోనే సంతోష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థి మృతితో కళాశాలలో, గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చూడండి:Telangana High Court News: 'ప్రభుత్వ వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేం'