Student dead: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో విషాదం నెలకొంది. మే 17న ఇంటర్ పరీక్ష రాస్తూ స్పృహ కోల్పోయిన విద్యార్థి.. ఇవాళ ఆసుపత్రిలో మృతిచెందాడు. మహేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బూరాడ కార్తీక్ అనే విద్యార్థి.. కిరణ్మయి జూనియర్ కళాశాల సెంటర్లో పరీక్ష రాస్తూ సృహ తప్పి పడిపోయాడు. దీంతో... హుటాహుటిన పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్సపొందుతూనే సదరు విద్యార్థి ప్రాణాలొదిలాడు. కార్తీక్ సొంతూరు సారవకోట మండలం దాసుపురం. కార్తీక్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పరీక్ష రాస్తూ స్పృహ కోల్పోయిన ఇంటర్ విద్యార్థి... చికిత్స పొందుతూ..! - student died in srikakulam
Student dead: ఏపీలోని శ్రీకాకుళం పాతపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మే 17న మొదటి సంవత్సం పరీక్ష రాస్తూ స్పృహ కోల్పోయిన ఇంటర్ విద్యార్థి... ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Student dead