తెలంగాణ

telangana

ETV Bharat / crime

Inter Student Suicide: ఇంటర్​లో ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య - student suicide in telangana

Inter Student commits suicide for failing in chityal
Inter Student commits suicide for failing in chityal

By

Published : Dec 17, 2021, 8:25 PM IST

Updated : Dec 17, 2021, 9:13 PM IST

16:24 December 17

Inter Student Suicide: ఇంటర్​లో ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య

Inter Student Suicide: ఇంటర్​ విద్యార్థులు చేజేతులా తమ భవిష్యత్తును చిదిమేసుకుంటున్నారు. పరీక్షల్లో తప్పమన్న బాధతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో విలువైన ప్రాణాలను తృణప్రాయంగా తీసేసుకుంటున్నారు. నిరంతర ప్రయత్నమే జీవితమన్న పరమార్థాన్ని మరిచి.. ఓటమికి తలొంచి తనువు చాలిస్తున్నారు.

inter results 2021: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని... వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు బలవన్మరణానికి యత్నించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్​లో ఫెయిల్​ అయినందుకు మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న వచ్చిన ఇంటర్​ పరీక్షల ఫలితాల్లో.. చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన ఇంటర్​ ఫస్టియర్​ విద్యార్థి వరుణ్​(19) తప్పాడు. ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కుంగిపోయి.. ఇంట్లోనే ఉరేసుకుని మరణించాడు.

intermediate results 2021 ts: హనుమకొండ జిల్లాలో మరో విద్యార్థిని కూడా ఆత్మహత్యకు యత్నించింది. కమలాపూర్​ ఆదర్శ పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఇంటర్‌ ఫస్టియర్‌లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినందుకు.. తీవ్రమనస్తాపంతో పాఠశాల భవనం పైనుంచి దూకేసింది. గమనించిన తోటివిద్యార్థులు.. క్షతగాత్రురాలిని హుటాహుటిన ఏంజీఎం ఆస్పత్రికి తరలించారు. తోటి విద్యార్థులు అప్రమత్తమై.. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లటం వల్ల విద్యార్థినికి ప్రాణాపాయం తప్పింది.

ఇదీ చూడండి:

Last Updated : Dec 17, 2021, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details