తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండో అంతస్తు పైనుంచి దూకి ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య - మల్లేపల్లిలో ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

కాలేజీలోనే ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని హబీబ్​ నగర్​ పీఎస్​ పరిధిలో జరిగింది. మల్లెపల్లిలోని ఓ​ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న షిఫానాజ్ రెండో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

Inter student commits suicide by jumping from second floor  in anwarul uloom college  in hyderabad
రెండో అంతస్తు నుంచి దూకి ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Mar 23, 2021, 8:01 PM IST

హైదరాబాద్​ హబీబ్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని మల్లెపల్లిలోని ఓ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న షిఫానాజ్ అనే విద్యార్థిని 2వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని కళాశాల సిబ్బంది హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

ABOUT THE AUTHOR

...view details