Ganja Smugglers: గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈనెల 4న మహదేవపూర్ పోలీసులు లక్ష్మి బ్యారేజ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారని ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో రెండు కార్లలోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. తమ సిబ్బంది వెంటనే తనిఖీలు చేయగా.. 4 కిలోల 130 గ్రాముల గంజాయి, రూ.1.85 లక్షల నగదు కనిపించాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - telangana crime news
Ganja Smugglers: మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్‌చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. 4 కిలోల 130 గ్రాముల గంజాయి, రూ.1.85 లక్షల నగదు, కార్లు,చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
inter state ganja smugglers
ఒడిశాలోని కలిమెల నుంచి మహదేవపూర్ మీదుగా మహారాష్ట్రలోని జౌరంగబాద్‌కు గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించామని ఎస్పీ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నిందితులు కాలె కృష్ణ, జౌరంగబాద్‌కు చెందిన కాలె విజయ్, దబడె గోపాల్, సప్కాల్ మయూర్‌గా గుర్తించామన్నారు. గంజాయితో పాటు కార్లు, చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.