Intelligence Officials Alerted in PFI conspiracy Telangana: పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌తో పాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరిగొచ్చని తెలిపారు. ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు.
ఈ మేరకు తెలంగాణలోనూ పీఎఫ్ఐ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ అధికారుల అధ్యయనంలో తేలింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులు నిఘా పెట్టాలని.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్లు దాడులు చేసి పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు.