ఎన్నో కేసులను చాకచక్యంగా పరిష్కరించిన మధ్యమండలంలోని ఓ పోలీసు ఠాణా ఇన్స్పెక్టర్ సతీమణికే రూ.1.04 లక్షల టోకరా వేశారు. ఇటీవల ఇన్స్పెక్టర్ సతీమణి ఆన్లైన్లో రూ.500 విలువ చేసే చీరకు ఆర్డర్ ఇచ్చారు. డెలివరీ అనంతరం ప్యాకెట్ విప్పి చూస్తే ఆమె ఆర్డర్ ఇచ్చిన చీర రాలేదు. సంబంధిత సంస్థను సంప్రదించడానికి గూగుల్‌లోని కస్టమర్ కేర్ నంబర్‌ను తెలుసుకుని ఫోన్ చేశారు. ప్యాకింగ్ చేసేటప్పుడు పొరపాటు జరిగి ఉంటుందని అవతలి వ్యక్తి చెప్పాడు. మీ డబ్బులు తిరిగి పంపిస్తానని బదులిచ్చాడు.
Cyber Crime : ఇన్స్పెక్టర్ సతీమణికి రూ.1.04 లక్షలు టోకరా
సైబర్ నేరగాళ్ల పంజాలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నిరంతరం చెబుతూనే ఉన్నారు. ఆ కేటుగాళ్ల వలకు అమాయకులు చిక్కకుండా అహర్నిశలు పాటుపడుతున్నారు. ఎన్నో కేసులను చాకచక్యంగా ఛేదిస్తున్నారు. ఎన్నోసార్లు.. ఎంతోమంది సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించిన ఓ పోలీసు అధికారి సతీమణే వారి వలలో చిక్కారు. దాదాపు లక్ష రూపాయలు మోసపోయారు.
సైబర్ వలలో పోలీసు భార్య, సైబర్ నేరాలు, తెలంగాణలో సైబర్ నేరాలు
ఆమె బ్యాంక్ ఖాతా నంబర్ తెలుసుకుని, క్యూఆర్ కోడ్ పంపించాడు. దానిపై బాధితురాలు క్లిక్ చేయగానే ఖాతాలోంచి రూ.45వేలు మాయమయ్యాయి. ఇదేంటని అడిగితే పొరపాటు జరిగిందంటూ.. మరో కోడ్ పంపించాడు. దానిపై క్లిక్ చేస్తే రూ.25వేలు, మరోమారు రూ.25వేలు, ఇంకోసారి రూ.9వేలు ఇలా మొత్తం రూ.1.04 లక్షలు దోచేశాడు. అనంతరం బాధితురాలు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.